మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో రెండవసారి అధికారం స్వీకరించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన డా. వై. యస్. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోని మానవీయతను రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్ర నిపుణులు, విద్యాధికులు, విజ్ఞాన వతంసులు పరిపాలనా నిపుణులు విశ్లేషణలతో పాటు వివిధ పత్రికలలో సంపాదకీయాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషణలలో ఎటువంటి పూర్వానుభవం లేకున్నా నేను ఈ సాహసం చేయటానికి గల కారణం అపర భగీరథుడైన డా. రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమ, అభివృద్ధికి తరగని చిరునామాగా నిలిచి ఆంధ్రదేశాన్ని ఆధునికుల కలల ప్రపంచంగా తీర్చి దిద్దుతూండుటయే. అంతేగాదు "మాటిస్తే మడమ తిప్పకుండా ఉండడం ఆరు నూరైనా తాను చెప్పిన మాట పై నిలబడి దానిని సాధించి ప్రజల ముఖారవిందాలలో సంతోషాన్ని నింపడం.
- డా. జి. రామచంద్రారెడ్డి