Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

      ప్రతీ యూట్యూబర్ విలువలు పాటించాలి ఒక  చొట స్థిరంగా ఉండని వీక్షకుడి మైండ్ ని తాను సృష్టించిన వీడియో మీద కట్టిపడేసేలా చెయ్యడమే ఏ యూట్యూబర్ విజయ రహస్యమైనా! ఈ కళలో ఎందరో ఆరితేరారు. నవంబర్15, 2006న గూగుల్ సంస్థ యూట్యూబ్ ని కొనుగోలు చేసిన రోజు మన దేశంలో మొదలైన మొదటి పది యూట్యూబ్ ఛానెళ్లలో నా “కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్" చానెల్ ఒకటి. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇన్నేళ్లలో యూట్యూబ్ లో వచ్చిన ఎన్నో మార్పులు కళ్లారా చూశాను.

                   కుకరీ, ఆధ్యాత్మికం, వినోదం, టెక్నాలజీ, ట్రావెలింగ్, వార్తా విశ్లేషణలు వంటి అన్ని రంగాల్లో ఎందరో దూసుకువచ్చి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ప్రతీ ఒక్కరూ ప్రధానంగా మూడు వర్గాలుగా విడిపోయారు. విలువలతో కూడిన నాణ్యమైన కంటెంట్ ఇస్తూ తమని తాము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ విధానాలతో మార్కెట్ చేసుకోవడంపై దృష్టి పెట్టని వర్గం మొదటి కోవ. వీరు ఎంత గొప్ప సమాచారం ఇచ్చినా యూట్యూబ్ లెక్క కూడా చెయ్యదు. అది ఆల్గారిథమ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి దాని లొసుగులు తెలిస్తే చాలు, చేవలేని కంటెంట్ నైనా మార్కెట్ చేసుకోవచ్చు. ఆ మెళకువలు వీరికి తెలీకపోవడం వల్లా, తెలిసినా ఆసక్తి చూపించకపోవడం వల్లా కొన్నాళ్లకి యూట్యూబ్ కి ఇలాంటి వారు దూరమవుతున్నారు.

                  ఇక నాణ్యమైన లైటింగ్, బ్యాక్ గ్రౌండ్ ఎస్సెట్స్, కెమెరా మెళకువలు, బాడీ లాంగ్వేజ్ మొదలుకొని ప్రజంటేషన్ వరకూ ప్రతీ అంశంలో జాగ్రత్త తీసుకుంటూ, మరో ప్రక్క తమని తాము మార్కెట్ చేసుకునే వారు యూట్యూబ్ లో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇక మూడో వర్గం ఉంది.. సత్తా లేదు, కంటెంట్ ఉండదు.. జనాల బలహీనతలను బాగా నుంచి వారిని బుట్టలో పడేసేలా ఓ థంబ్ నెయిల్ సృష్టించి, క్లిక్ బెయిట్స్ ద్వారా ఇంకయాలనుకునే తరహా వర్గం. ఇలాంటి వారూ యూట్యూబ్ లో మారుతున్న ఆల్గారిథమ్స్ పిల్ల ఎక్కువకాలం నిలదొక్కుకోలేరు.