ఈ సృష్టిలో నియతి ఎవరు ఏర్పరచారు. సూర్య చంద్రాదులు ఆ నియతి తప్పకుండా ఎలా ప్రభావిస్తున్నారు? నక్షత్ర మండలం ఎలా ఉనికిని పొందుతుంది? ఇది అగ్ని, ఉర్ద ముఖ్యంగా ప్రజ్వరిల్లునుగాక, ఇది జలము. ఇది పల్లమునకు ప్రవహించునుగాక, అనెడి ధర్మాలను వాటికీ ఎవరు నిర్ణయించారు? పుష్పాలకి సౌరభం ఎవరు కల్పించారు" వృక్షాలకు ఫలాలనిమ్మని ఎవరు ఆదేశించారు?
అదే బ్రహ్మము
ఈ సృష్టిలో కనబడే మాయా విలాసము కంతటికీ ఆ బ్రహ్మమే కారణము సృష్టిలో సర్వులకూ రూపం అదే. ఆ బ్రహ్మము మాయా విలాసము వల్లనే ఈ జగత్తు అనబడే దృశ్యము ఏర్పడుతుంది. ఈ సృష్టి అంత మిధ్య, బ్రహ్మము లేదా శుద్ధ చైతన్యము కల్పించిన మాయయే. ఆ మాయను ఛేదిస్తేగాని, జీవునికి మౌక్షం కలగదు.