తెలుగు సాహిత్యంలో ఎడారిపాట కవిత్వాన్ని, నీళ్ళంకని నెల కథల సంకలనానికి "పోలిముద్ద" కథని అందించిన గౌరెడ్డి హరిశ్చంద్ర రెడ్డి గారు నవల ప్రక్రియలో భాగంగా యోధుడు కొండారెడ్డి ఆవిష్కరిస్తున్నారు। ఇది సాహిత్య చరిత్రలో సంచలనం కాగలదాని విశ్వసిస్తున్నాను। ఎన్నో ఊహలు, కల్పితాలతో వచ్చిన అనేక చారిత్రక నవలలకంటే ఇది భిన్నమైనది। ఆధునిక తరం తెలుసుకోవాల్సిన కతాంశం। పరిశోధిస్తే గొప్ప సత్యాలను ఈ సమాజానికి అందించవచ్చని రచయిత నిరూపించారు। ఈ క్రమంలో వాస్తవమైన వార్ధమాన రచయితలకు స్ఫూర్తిదాయకమైన సందేశమిచ్చారు। ఇది ప్రతి పౌరుడు చదవాల్సిన పుస్తకం।
- కేంగార మోహన్।