Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“స్త్రీలు శక్తి విషయంలో కూడా మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోరు.. తరతరాలుగా స్త్రీ బలహీనురాలు అనే విషయాన్ని పదేపదే ఆపాదిస్తూ ఆడవాళ్ళలో, సమాజంలో వాళ్లు బలహీనులు అన్నట్టు ట్యూన్ చేసి పెట్టారు. అది తప్పు. ఆ తప్పును సరిదిద్దే టైమ్ వచ్చింది. దాన్ని ప్రతీ అమ్మాయి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ అబ్బాయ్ సహకరించాలి.
స్త్రీలు తమలోని శక్తిని గ్రహించడం ఎంత ముఖ్యమో, పురుషులు స్త్రీల శక్తిని గుర్తుచేయడం కూడా అంతే ముఖ్యం. స్త్రీ తన శక్తిని తాను నమ్మగలిగితే తన పూర్తి స్థాయి స్వేచ్ఛను.. సమాన హక్కును పొందగలదు. ఎప్పుడైతే తన శక్తిని తాను తెలుసుకోలేక ఇంకొకరి మీద డిపెండ్ అవుతుందో... తన స్వేచ్ఛను ఇంకొకరి చేతిలో పెట్టినట్టే. వాడు సంతోష పెడితే సంతోషపడాలి, వాడు బాధ పెడితే బాధపడక తప్పదు. మన ఎమోషన్స్ టీవీలో వచ్చే ఛానల్స్ కాదుకదా.. రిమోట్ ఇంకొకళ్ళ చేతిలో పెట్టి వాడు మన ఎమోషన్స్ ని ట్యూన్ చేయడానికి......! ఏదైనా గొప్పపని చేస్తే వాడు మగాడ్రా! ఆమె ఆడది ఐనా మగాడిలా పోరాడింది! లాంటి మాటలు ముందుముందు సమసిపోవాలి!! అమ్మాయిగా పుట్టిన ప్రతి ఆడబిడ్డ.. పుట్టుకతోనే మానసికంగానూ, శారీరకంగాను బలవంతురాలిగా పెరగాలి. మగవాళ్ళలా పెంచకండి., మగాళ్ళకి ధీటుగా పించండి!!"
- బాలాజీ ప్రసాద్