బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్ట బెట్టాడనికి రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. ఇది ఆచరణ శున్యమైన అందమైన మోసం. కుర్చీ పై అలంకార ప్రాయంగా బెరుకుగా బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం మాత్రమే వారికీ ప్రాప్తం. వీళ్లు తోలుబొమ్మలు మాత్రమే. ఆడించే సూత్రధారులు కింగ్ మేకర్లు. ఇది వర్తమాన కలియుగభారతం . అభాసుపాలౌతున్న ఈ తంతు సర్వేసర్వత్రా కన్పిస్తుంది. హృదయ విదారకమౌతున్న ఈ దృశ్య ముఖచిత్రం రాజ్యంగానే నాగుబాటుకు గురి చేస్తుంది. ఈ ఇతివృత్తంతో సోదరుడు వల్లూరు శివప్రసాద్ వ్రాసిన ఎదుగుడిసెల పల్లె నాటకం ఒక మంచి.... కాదు గొప్ప రచన. ఈ నాటకంలో ప్రతి మాట గుండె లోతుల నుండి ఉబికి వచ్చాయి. అందుకే అందుకే సహజత్వాన్ని పుణికి పుచ్చుకొన్నాయి. మనచుట్టూ జరిగే కథలను... వారి వ్యాధులను మనకళ్ల ముందు వేదిక పై సాక్షాత్కరింప చేశాడు. ఇది నాటకం కాదు సుమా! అచ్చమైన యదార్ధ... సజీవ దృశ్యం... నాటాకీకరణాతో కాకుండా మనసు పెట్టి వ్రాసిన అచ్చమైన వాస్తవం. ఇది కాలానికి నిలిచే నాటకం .. ఇది నిజం... కాదు ఇదే నిజం...