ఒక్కొక్కసారి చెప్పిందే చెప్పుకుంటూ, విన్నదే వింటూ ఆనందపడిపోతాం. ఇది అందరికి అనుభవమే. ఒకనాటి మాటని, అలనాటి పాటని ఎప్పుడు తల్చుకుంటూ, పడుకుంటాం.
సినిమా సామాన్యుల జీవితంలో భాగమైపోయింది. ఎప్పటికి గుర్తుండిపోయే మంచి సినిమాతో, మంచి నటితో, మంచి గాయనితో గాయకునితో ఎన్నో మానసికానుబంధాలు పెనవేసుకుపోయి ఉంటాయి ప్రతి వారికీ. ఆంధ్రులు భానుమతి పాటతో, ఆమె సినిమాలతో, ఆమె నటనతో, ఆమె సాహిత్యప్రస్థానంతో విడదీయరాని బంధంతో జీవిస్తున్నారు.
- ఇంద్రగంటి జానకీబాల