పాఠక మిత్రులకు!
ఎప్పుడో 60 యేళ్ళ క్రితం కాలేజీలో విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఈ మద్య చుసిన "జాను " అనే సినిమా నాలో పునరుజ్జివింపజేసింది. ఈ సంపుటిలోని "నా గుండెల్లో దాచుకునేదాన్ని" అన్న కథ ఆ పునరుజ్జివనం ఆధారంగా రూపుదిద్దుకున్నదే.
15 యేళ్ళ క్రితం కొందరు కవిమిత్రులతో కలిసి కాకినాడ దగ్గరుండే యానాంకు వెళ్ళాం. యానంలో ఉండే కవిమిత్రుడు దాట్ల దేవదానంరాజు ఎప్పుడు కలిసినా "మా యానాంకు ఒకసారి రండి" అని ఆహ్వానించేవాడు. కాకినాడలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమాన్ని ముగించుకొని, ఆ మర్నాడు యానాం వెళ్ళాం. యానాం వెళ్ళి గోదావరి నదిమీద ఒక రెండు గంటల సేపు పడవ షికారు చేశాం. ఆ పడవలోనే మాతోబాటు అప్పుడే పెళ్ళి చేసుకున్న ఒక ప్రేమికుల జంట కూడా విహరించారు. దీని ఆధారంగా నేను "యానాంలో ఒక రోజు" అనే కథ రాశాను. నా ఇదివరకటి కథల్లాగే ఈ కథలు కూడా పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయాని ఆశిస్తూ....