నాకపురిని నరకపురిగా మర్చి తన గుప్పిట్లో ఉంచుకున్నాడు ధర్మరాజు. నా పేరు యమ అంటూ - ఆ ఊరికి దేవుడిగా ప్రకటించుకున్నారు. రాక్షసంగా పాలిస్తూ, పౌరుల్ని బానిసలకంటే హీనంగా చూస్తూ - వారి పూజల్ని అందుకుంటున్నాడు. వారి మూఢత్వం ఆసరాతో ప్రజాస్వామ్యాన్ని నామమాత్రం చేసి, ఎన్నికల్లో తనకు పోటీ లేకుండా చేసుకున్నాడు. అతడి అనుమతి లేనిదే చీమైనా ఊరు దాటదు. ధోమైన ఊళ్ళో దురాదు. ఊరు దాటినా అక్కడి పౌరుల్లో, అతడిపట్ల విధేయతకు భంగం వాటిల్లదు. ఊళ్ళో కొందరు వివేకవంతులున్న, మిగతా జనం కలిసిరాక కిమ్మనకుండా ఉన్నారు.
ఇలాంటి ఆ ఊరి యువతి బయటి ప్రపంచంలోని యువకుణ్ణి ప్రేమించింది. ఆ ప్రేమే నరకపురిని శ్రీకర్ అనే పోలీసు అధికారి దృష్టిలోకి తెచ్చింది. జనం సహకారంతో తన కార్యాలయాన్ని వినూత్నంగా, ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్న శ్రీకర్ కి కూడా- నరకపురి ఇనుపగోడాలు దుర్బేధ్యంగా ఉన్నాయి.
- వసుంధర