Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
"ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా" అని శంకర భగవత్పాదులు వాక్రుచ్చిరి. అనగా ఈశ్వరానుగ్రహమును సంపాదించనిది కైవల్యము నొంద జాలము అని తాత్పర్యము - అటి కైవల్యమును పొందుటకు ముందుగా దేహమును సంస్కరించ వలెను. అట్టి సంస్కృతమైన దేహమే బ్రహ్మవిచారము చేయుటకు సమర్థమగును. కావుననే వేదములందు ముందుగా కర్మకాండను పిమ్మట జ్ఞానకాండను బోధించుట జరిగినది. ఈ కావున మహర్షులు అనేక సంస్కార . కర్మలనూ, ప్రారబ్బాది దోష పరిహారార్ధముగా శాంతి, పౌషిక కర్మలనూ మనకు తెలిపిరి. ఈ కర్మలను బోధించు విద్యయే స్మార్త విద్య. అట్టి స్మార్త విద్యను అభ్యసించు విద్యార్ధులకూ,యాజ్ఞకులకూ, శ్రద్ధాళువు లైన యజమానులకు సులభగ్రాహ్యముగా ఉండుటకై .స్కార గ్రద్దములను ప్రకటించుట జరుగుచున్నది.
ఈ పరంపరలో ఈ గ్రంథము ఐదవది. ఇందు మహాలింగార్చనా, సహస్ర లింగార్చనా, సూర్య నమస్కార ప్రయోగము, పంచకాఠకములు, ఆయుష్య హోమ, దత్త స్వీకారాది కర్మలు, సప్త పాకయజ్ఞములు, దేవతా కల్యాణ ప్రకారము, వివిధ దేవతా ప్రవరలు, లగ్నాష్టకములు, కొన్ని ప్రాయశ్చిత్తాదులు పొందుపరచబడినవి. ముందు ప్రచురణలలో గర్భాధానాది కర్మలకు సంకల్పములు, నాందీముఖ, వేద వ్రత ప్రకరణము, యదృతాది హోమములు, ఉపాకర్మ, నాకబలిః మున్నగు భాగములు కూడా ముద్రించి యున్నాము. ఈ పాఠములు తృతీయ భాగ రూపమైన 'సంస్కార మహోదధి" లోనికి చేర్చినందున ఈ ముద్రణలో ఇందు చేర్చబడలేదు.