ఈ పుస్తకంలో తొమ్మిది పరిశోధన వ్యాసాలున్నాయి. మహాభారతం నుండి నేటివరకు వచ్చిన తెలుగు కావ్యాలలో ని సామాజికాంశాలను ఈ వ్యాసాలు చర్చించాయి. మన సాహిత్యంలోని కావ్యాలలో విజ్ఞానసర్వస్వ లక్షణాలున్నాయని రచయిత ప్రతిపాదించాడు. తన ప్రతిపాదనను నిరూపించుకునే అనేక ఆధారాలను చూపించాడు. మనం సాహిత్యాన్ని అధ్యయనం చేసే విధానంలో ఒక నూతన దృక్పధాన్ని వెంకటరత్నంగారు ఈ వ్యాసాల్లో ప్రతిపాదించారు.