"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు " అంటూ యావదాం ద్రప్రదేశ్ లోని ప్రజానీకం ఏకకంఠంతో నినదించిన అపురూపమైన సన్నివేశమిది. తమ రాష్ట్రానికి న్యాయబద్దంగా రావలిసిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మొత్తంగా రానీయకుండా, లేదా శకలాలుగా విభజించి ఒక ముక్కను మన మోహన కొడదామని ఢిల్లీ పాలకులు చేసిన కుటిల ప్రయత్నాలకు అడ్డుకట్టు వేయటానికి 32 మంది తమ ప్రాణ త్యాగం చేసి అమరులైన విషాద ఘట్టమది.