మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో రచయితా కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి వెళ్ళిపోయి... అక్కణ్ణించి ... ఘనీభవించని తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి 'వీరయ్య' గా మన ముందు పరిచాడు.
- తనికెళ్ళ భరణి
ప్రియమైన కృష్ణగారికి అభినందనలు, నేను మీ పుస్తకము 'వీరయ్య' చదివాను. చాలా చోట్ల మీరు ఎంతో విపులంగా వ్రాసిన వివరాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ఉన్నాయి. మీ కృషి అసామాన్యం.
- ఉమా మేస్త్రి