భారతదేశం మొదటినుంచి విభిన్న జాతులకు నిలయంగా ఉండేది. ఈ జాతులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటుండేవి. దీనివల్ల ఇతర సంస్కృతుల ప్రభావం వీటిమీద ఉండేది కాదు. దీని ఫలితం ఈ తేగల బీదరికం, వెనుకబాటుతనం, సామజిక వేర్పాటుతనం. నేర తెగలుగా ముద్రపడిన ఈ తెగలు ఈ కళంకం వల్ల సమాజం నుంచి వెలివేయబడటం జరిగింది. ఈ తెగలు నివసిస్తున్న సెటిల్మెంట్లలో , గ్రామాలలో వీరికున్న విద్యా సదుపాయాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం.