లూనచార్ స్కి ని విద్యాశాఖ ప్రజా కమిస్సారుగా లెనిన్ నియమించారు. విద్యారంగంలోని ఇతర ప్రముఖులతో కలిసి లూనచార్ స్కి సోవియట్ ప్రభుత్వం తొలి రొజ్కుల్లో ఎదుర్కోవలసివచ్చిన అసాధారణ క్లిష్ట పరిస్థితుల్లో ఒక నూతన విద్య వ్యవస్థీక పునాది వెయ్యడంలోనూ, సోవియట్ పాఠశాలను సంస్కరించేందుకు అవసరమైన సైద్ధాంతిక, ఆచరణాత్మక మౌలిక సూత్రాలను రూపొందించడంలోనూ సఫలుడయ్యాడు. లూనచార్ స్కి ఆనాడు చెప్పిన మాటల్లోని దూరదృష్టి మూలంగా వాటికీ సమకాలీకత సమకూరింది. పాఠశాలకి - జీవితానికి మధ్య సంబందాలపైనా, పాఠశాల పోలిటెక్నీకల్ స్వభావం పైనా, సాంస్కృతిక రంగంలో నిర్మాణాత్మక కృషి, ఆర్ధిక - రాజకీయ సమస్యలకు వున్న ప్రత్యక్ష సంగతత్వం పైనా అయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి ఈ నాటికీ మరింతగా తగివున్నాయి.
-లూనచార్ స్కి.