'చదువు చెప్పే అధ్యాపకులు తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది చాలా వున్నది' అని జె. కృష్ణమూర్తి అంటున్నారు.
తరగతి గదిలో విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరు సమానమే, ఇద్దరూ కలసి నేర్చుకోవాలి తప్ప టీచరు బోధించడమూ విద్యార్థి నేర్చుకోవడమూ కాదు అని కూడా అన్నారు.
విద్యా బోధకులు అంటే పాఠశాలలో చదువు చెప్పే వారు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, పెద్దలు విద్యా రంగంలో కృషి చేస్తున్న వారందరూ. పాఠశాలలో వాతావరణం ఎంత ముఖ్యమో గృహ వాతావరణానికి కూడా అంతే పాముఖ్యత వున్నది.
కొన్ని ప్రత్యేక సమావేశాలలో కృష్ణ మూర్తి తల్లిదండ్రులతోను, అధ్యాపకులతోను మాట్లాడిన విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. విద్యావేత్తలందరూ పరిశీలించవలసిన విషయాలు ఇవి.
- జె. కృష్ణమూర్తి