"మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపారనమ్మకం. ప్రతివ్యక్తికి పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద -"
ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్ధానమయ్యాడు.
-మార్క్ ట్వైన్.