Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
వెన్నెలకు రాస్తూ......
ఈ వెన్నెల నా వెన్నెల, ఈ వెన్నెల నా కోసమే కాస్తున్న వెన్నెల, ఈ నెన్నెల నాకై రాతై రాయిస్తున్న కవితలు, వెన్నెల లేనిదే ఈ కవితలు లేవు-రావు. నేను ఆస్థాన ఉద్ధండ కవిని కాను, నా కవిత్వం తాత్విక ఘోష అదంతా వెన్నెల రాత్రులలో ఇంద్రియ ప్రతిఫల మానసిక వ్యక్తీకరణపు ఐడియల్స్ మాత్రమే, దీనికి కవిత్వం అని పేరు పెట్టినా పెట్టకపోయినా ప్రతిఫలిస్తూనే ఉంటాయి...
వెన్నెల నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పకనే చెప్పిన కవిత్వం ఇదంతా.. ఈ కవిత్వం ప్రేమ కవిత్వం వెన్నెలను ప్రేమిస్తూ రాసిన కవిత్వం.... ప్రేమించండి కవిత్వం దానంతటదే వచ్చేస్తుంది.... భావోద్రేకం దాని చిరునామా... కవిత్వం ఇంద్రియ-కర్మేంద్రియ స్థితి యొక్క అనివార్యం, అదే మానసికమైన ఐడియల్స్ రూపాన్ని తీసుకోవడం, అందుకే సాధారణంగా ప్రతి వ్యక్తి కవిత్వాన్ని రాయగలడు.... అది బ్రహ్మ విద్య మాత్రం కాదు కాసింత భావోద్రేకాలు చాలు....
నా భావోద్రేకం వెన్నెల..ఆ వెన్నెలకు నా ప్రేమ తెలియదు, అర్ధం కాదు..... మీలో ఎవరికి అర్థమైనా వెన్నెలకి తెలపలేరు కూడా... అందుకే నాకు మాత్రమే పరిమితమైన నా ప్రేమ వెన్నెలకు ఎప్పటికీ తెలియదు................