Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

బతుకు రంగస్థలం పై బోన్సాయ్ మొక్కలు

వనజ తాతినేని నా చేతిలో వెలుతురు బాకు ని పెట్టి చానాళ్ళై పోయింది. ఇంత అలసత్వం యెప్పుడూ జరగలేదు. రకరకాల కారణాల వల్ల ఇంత జాప్యం జరిగింది. మీరెప్పటికైనా వ్రాయండి, మీ ముందుమాట వుండాలి “అన్న ఆమె అభిమానం తన గురించి ఎక్కువగా ఆలోచించేందుకు కారణమైంది.” గతంలో “తను వుత్తమ కథకురాలిగా “భూమిక”అవార్డ్ ని అందుకున్న సందర్భంలో మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే మీరు వ్రాయాలి అనే మాట తీసుకుంది. మంచి కథలు వ్రాసే వ్యక్తిగా గుర్తింపు పొందిన వనజ కవిత్వంలోనూ తన పత్యేకతను నిలుపుకుంది.

భూమికలోనూ, వెబ్ మాగజైన్స్ లోనూ, పత్రికలలోనూ, కవి సంగమం లోనూ అడపాదడపా తన కవితలు చదువుతూనే వున్నాను. పుస్తక రూపంలోకి వచ్చేసరికి రాణించే కవితలే ఎక్కువగా కనిపించాయి.

రాన్రాను భాషలో మార్పు కవితా శీర్షికలలో మార్పు, వ్యక్తీకరణలో మార్పు, వస్తు ఎన్నికలో, కవిత్వ చిక్కదనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్త్రీలు రచయిత్రులుగా మారాలంటే ఇల్లు, వంటిల్లు ఆమెపై యెంత వొత్తిడిని తీసుకొస్తాయో “చెక్కేసిన వాక్యం” కవితలో వ్యక్తీకరించింది. వాక్యాన్ని చెక్కుతుండగానే పెన్సిల్ ముక్క విరిగినట్లుగా అధికారాల మధ్య నిసృహగా వాక్యమెక్కడో జారిపోతుంది | అంటుంది. “పాకశాలలో చిక్కబడిందే స్త్రీల జీవితమనేది యెప్పటికీ మారని నిర్వచనమే | దానిని చెరిపేయాల్సింది కూడా మనమే అంటుంది. ఈ కవిత చదువుతుంటే వసంతా | కన్నాభిరామన్ గుర్తొచ్చారు. స్త్రీల నైటీలకి కానీ, దుస్తులకి గానీ వొక జేబు వుండాలి. అందులో ఓ పేపర్ పెన్నూ వుంటే ఎంతపనిలో వున్నా క్షణంపాటు వెలిగే భావాలని రికార్డ్ చేసుకుని తర్వాత రాసుకోవచ్చు అన్నారు. ఆ

వనజ హృదయ అత్యంత సున్నితం. ఒక పువ్వు పూయగానే తానే వొక రిక్ష విరిసినట్లుగా అనుభూతి చెందటం కనిపిస్తుంది. అస్వతంత్ర వాతావరణంలో స్త్రీల చుట్టూ వేసిన ముళ్ళ కంచెలని గమ్మత్తుగా, చిత్రంగా, వాస్తవంగా, వ్యంగంగా "జివిత...........