Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
జీవితంలోంచి మలచబడ్డ ఈ వేలుపిళ్లి కథలు జీవన వైవిధ్యంతోపాటు రచనాశైలి కూడా అపారమైన వైచిత్రితో నిండి ఉండడం వీటి ప్రత్యేకత.
“మంచి తెలుగు కథల పట్ల అభిరుచి వున్న పాఠకులకు సి. రామచంద్రరావు గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక కథకుడు గుర్తు పెట్టుకోదగ్గ కథలు ఎన్ని రాశాడని ఆలోచించినప్పుడు మన మనోవీధిలో మెదిలే కొద్దిమంది కథకుల్లో రామచంద్రరావుగారు ఒకరు.” - కోడూరి శ్రీరామమూర్తి
“పాత్రలు యధార్ధ జీవితంలోంచి వచ్చి సజీవంగా కనబడతాయి. ఏ వర్గ జీవితంలోంచి తీసుకోబడ్డాయో, ఆ వర్గ జీవితాన్ని బహిర్గతం చెయ్యడంలో నిండు నిజాయితీ కనబడుతుంది. చెయ్యి తిరిగిన కథారచయిత శిల్పవిన్యాసం ద్యోతకం అవుతుంది.”
- చాగంటి సోమయాజులు
“సి, రామచంద్రరావు గారి కథలు కావ్యాల్లాంటి కథలు. ఆయన 1964 నాటికి ఏడే కథలు వ్రాశారు. ఈ కథలు 'స్మరవారం వారం' (మళ్ళీ మళ్ళీ తలచుకో) అంటాయి పాఠకుడితో." - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
"అంతర్జాతీయ స్థాయి సి. రామచంద్రరావు కథల్లో తప్పకుండా వుంటుంది.”
- అదివిష్ణు