ఆ మహూజ్వల మూర్తి మన అది గురువు. బ్రహ్మజ్ఞాన సంపన్నులు. భారతీయ సంస్కృతికి మూలా పురుషులు. విజ్ఞానకోశాలైన వేదాలను విభజించిన వారు. ఆధ్యాత్మిక సంపదకు నెలవైన భగవద్గితను అందించిన వారు. భక్తిభావ విలసితలైన అష్టాదశ పురాణాలూ కూర్చిన వారు. పంచమవేదమైన మహాభారత మహేతిహాసం జాతికి ప్రసాదించిన వారు. వారిని మించిన మహాకవి, తత్వవేత్త ఈ నెల పై మరొకరు లేరు.
భగవంతుని అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధ గన్నది వ్యాసావతారం. అది మానవ దుఃఖాన్ని తొలగించటానికి వచ్చింది. ఆ మహనీయుని పవిత్ర చరిత్రకు ప్రతిబింబం ఈ గ్రంధం.