ఆయుర్వేద విజ్ఞానము, సంస్కృతo నుండి వెలువడి నగుటచే సాధారణముగా ఆయుర్వేద గ్రంథములన్నియును సంస్కృత భాషయందే లిఖింపబడియున్నవి. సంస్కృతము వ్యావహారిక భాషగా నుండేది కాలములో వేదములేగాక సమస్త శాస్త్రములును, పురాణేతిహాస న్యాయ ధర్మ శాస్త్రములను, సమస్త విజ్ఞాన గ్రంథములును,సంస్కృతము నుండే లిఖింపబడియున్నవి. భారతదేశమునకే కాక ప్రపంచమున కoతకును యధర్మ ప్రాయములుగా నుండిన కావ్య నాటకాలంకార ప్రబంధాది గ్రంథములన్నియును తద్భాషాలంకారములై యున్నవి. ఇదమృత జీవాణువులచే నేర్పడిన భాషయుగుటచే యెన్ని విఘాతము లేర్పడినాను యనేక వర్ష సహస్రములన్గడిపి నేటికిని సజీవమై యున్నది.
- శ్రీ వీటూరి వాసుదేవ శాస్త్రిగారు