గృహ ప్రవేశం సమయంలో ప్రతివారూ వాస్తుపూజ చేస్తారు. వాస్తుమండలాన్ని లిఖించి, వాస్తుపురుషుణ్ణి ఆవాహన చేస్తారు. ఆయన రాకతో క్షేత్రశుద్ధి జరుగుతుంది. శిల్ప శాస్త్రాల ప్రకారం వాస్తుపురుషుడు విశ్వకర్మను ప్రతిబింబించే రూపం. సకల వైదిక, పౌరాణిక పుణ్యాహ వాచన సమయాల్లో కూడా క్షేత్ర శుద్ధి కోసం ఆయననే ఆవాహన చేస్తారు.
వాస్తు శాస్త్రం ప్రతీ చిన్ననిర్మాణాన్నీ ఒక సంపూర్ణ విశ్వాన్ని ప్రతిబింబించే చిరుసృష్టి అనే పూజ్యభావంతో చూడాలని చెబుతుంది. ఆ సృష్టిని పూజించడానికి మనం లభించే వాస్తు మండలం సకల సృష్టిని, సృష్టి కర్త అయిన విశ్వకర్మను కూడా ప్రతిబింబిస్తుంది. కానీ ఆధునికులు వాస్తు పురుషుణ్ణి రాక్షసుని గా, భయంకరా కారునిగా చూపి మూలంలోని పవిత్ర భావనను చెడగొట్టారు.
- డా. జి. జ్ఞానానంద, కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య