Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                           మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం పరిష్కరించలేని  సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తిపోనవసరం లేదు. ముందు చారిత్రక భౌతికవాదంలోని వైశాల్యాన్ని గమనించాలి. దాని స్థూల మార్గదర్శకత్వంలో చరిత్రలో భాగమైన కళా  సాహిత్యాల ప్రత్యేకతలపట్ల శ్రద్ద పెంచుకోవాలి. సాహిత్యం సృజనాత్మక మానవ కలపమని, చైతన్య రూపమని, అది నిత్యం అపారమైన వైవిధ్యాన్ని సంతరించుకుంటుందనే  స్పష్టత ఉండాలి. విప్లవ సాహిత్య విమర్శకులకు ఇది పుష్కలంగా ఉంది. అందువల్లనే సామజిక ఉత్పత్తిగా సాహిత్యంలోని దేన్నయినా వివరించగల సిద్ధాంతం కోసం కృషి చేస్తున్నారు. దేనికంటే చలనం అనేక రూపాల్లో ఉంటుంది. వాటిన్నిటికి అత్యున్నత రూపం వర్గపోరాటం. ఈ ఎరుక సాహిత్య సిద్ధాంతానికి తెరచాపలా పని చేస్తున్నది.