Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అతనో చిత్రకారుడు. కొత్తగా మనుషుల పోర్టెడ్స్ ని గీయడం ఆరంభించాడు. ఈలోగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతని భార్య తన చిత్రాన్ని గీయమని కోరితే అంగీకరించాడు.
ఓ రోజు అతనికో నిజం తెలిసింది. తను బొమ్మలు గీసిన వారంతా మరణిస్తున్నారు! అవీ చిత్రమైన, అసహజమైన మరణాలు!!
మూఢనమ్మకాలు లేని అతని భార్య తన బొమ్మ గీయమని పట్టుబట్టింది. గీస్తే ఆమె మరణించచ్చు. గీయనంటే పట్టుదలగా విడాకులు తీసుకోడానికి సిద్ధపడింది. ముందు గొయ్యి-వెనక నుయ్యి పరిస్థితి.
అతను బొమ్మ గీసిన వారు ఎందుకు మరణిస్తున్నారు? ఈ గడ్డుసమస్యలోంచి అతనెలా బయటపడ్డాడు? సూపర్ నేచురల్ నేపధ్యంలోని ఈ నవలలో చిత్రవిచిత్రమైన పాత్రలున్నాయి. కొన్ని తామేడుస్తూ మిమ్మల్ని నవ్విస్తాయి. కొన్ని బాగా నవ్వించి తర్వాత ఏడిపిస్తాయి.
మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి స్వాతి వారపత్రికలో సీరియల్ గా వెలువడి, ఇప్పుడు పుస్తక రూపంలో మీ చేతిలో ఉన్న వర్ణచిత్రం చక్కటి సెంటిమెంటల్ థ్రిల్లర్.