మానవ జీవితాన్ని ఉద్దిపజేయడం కళల లక్ష్యం. మానవీయ భావనల్ని ప్రోది చేస్తూ హృదయ సంస్కారానికి దోహదం చేయడం సృజన కర్తవ్యం. లలితకళల్లో సాహిత్యం, చిత్రకళ ల పాధాన్యం అపారం. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు పరస్పరపూరకాలు. దేని అస్తిత్వం దానిదే. అయినప్పటికీ సాహిత్యం చిత్రకళని, చిత్రకళ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉదాత్తమైన దశకు తీసుకు వెళ్తుంది. అందుకే సాహిత్యం, చిత్రకళ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఉత్తమాభిరుచి కలవారు సాహిత్యాన్ని, ఇటు చిత్రకళని ఆస్వాదిస్తారు.
- ఎల్. ఆర్. వెంకటరమణ