Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అసలాయన్ని డిఫైన్ చేయాలంటే ఎవరికీ సాధ్యం?
ప్రపంచంలోని ఏ వస్తువునైనా, దేన్నైనా డిఫైన్ చేయగలం. మనకున్న స్పర్శ, జ్ఞానం, తెలివి అన్నింటిని బేస్ చేసుకుని... మనకి చల్లగా తగిలితే ఇది గాలి అని, వేడిగా తగిలితే ఇది సెగ, అని, నీళ్ళని చూడగానే నీళ్లు అని... ఇలా దేన్నైనా డిఫైన్ చేయగలం. పంచభూతాలని డిఫైన్ చేయగల, అర్థం చేసుకోగల మనం... ఈ వర్మని డిఫైన్ చేయమని అడిగితె మాత్రం సరిగ్గా ఇది చెయ్యలేం. ఎందుకంటే.... అతడ్ని జ్ఞాని అన్నా, పిచ్చోడన్నా, తెలివైనవాడు అన్నా ఏది అన్నా కూడా చివరికి అతను ఇదే అని చెప్పడం మాత్రం కష్టం, చాలా కష్టమైన పని. అంటే మాటలకూ, నిర్వచనాలకు అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.
కొంతలో కొంత ఇతడ్ని డిఫైన్ చెయ్యడానికి....
A Man beyond everything అనుకోవచ్చు...
అంటే వర్మ అన్నిటిని మించిన మనిషి అని.