Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మార్క్సిజం నిర్దిష్ట సమస్యలపై నిర్దిష్టంగ అధ్యయనం చేయాలని చెబుతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో అన్ని దేశాల చారిత్రక పరిణామ క్రమాలు ఒకే రకంగా లేవు. మార్క్స్ చెప్పిన చారిత్రక భౌతికవాదం ఐరోపా ఖండానికి ఉద్దేశించినదే. అలాగనీ మార్క్సిజం ఇతర ఖండాలకు, దేశాలకు వర్తించదా? అంటే యథాతధంగా అయితే వర్తించదు. కాని సమాజ గమనానికి చోదక శక్తులుగా ఉత్పత్తి శక్తుల అభివృద్ధి మరియు ఉత్పత్తి సంబంధాల మార్పుకై జరిగే వర్గపోరాటాలు కీలకమైన భూమికను పోషిస్తాయనే సూత్రీకరణను చేసింది. ఈ సూత్రం ఆధారం చేసుకొని ఏ దేశ ప్రత్యేక చరిత్రనైనా శాస్త్రీయంగా పరిశీలించవచ్చు. ఈ రకమైన అవసరాల నుండే నిర్దిష్ట సమస్యలపై నిర్దిష్ట అధ్యయనం చేయాలనే సూత్రీకరణనీ మార్క్సిజం అందించింది. మరి మార్క్సిజం సిద్ధాంత భూమికతో ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీలు భారతదేశ నిర్దిష్ట సమస్యనీ నిర్దిష్టంగా గుర్తించాయా? ఆ నిర్దిష్టతను గుర్తించటంలో అవి ఎక్కడ దారి తప్పాయో అనేదాన్ని పరిశీలించటం ఈ పుస్తక ఉద్దేశం.