Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹81

                                 శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. అదికావ్యమైన శ్రీముద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళికె ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న ఈ కావ్యం భారతీయుల ప్రాధమిక సొత్తు కావటం గర్వకారణం.

                                        అందువల్లే ఈ మహత్తర కధకు పరవశించిన భారతీయ కవులెందరో అందునా తెలుగు కవులెందరో వారు పొందిన అనుభూతుల్ని వ్యక్తపరుస్తూ వివిధ రచనలు చేశారు. తెలుగులో రామాయణ కావ్యానికి ఉన్న రచనలు, వైవిధ్య రచనలు మరే ప్రాచీన ఇతిహాసానికి, పురాణానికి లేవు. 

                                                                                                                 -కాటూరు రవీంద్ర త్రివిక్రమ్.