Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మున్ను డి మానవజన్మము జ్ఞాన సముపారనారమే లభించును. కనుకనే “ జ్ఞానేన
హీనః పశుభి స్సమానః” అనియు "అపి మానుష్యకంప్రాప్య భవంతి జ్ఞానినోనయే! పశుతై వవరా తేషాం ప్రత్యవాయా ప్రవర్త నాత్” అనియు ననిరి. అనగా, “జానము లేనివారు పశుప్రాయు లనియు, మానవులై జన్మించియు జానవంతులు కానిచో పశువులై జన్మించిన మేలుగ నుండెడిది. ' పశువునకు జ్ఞానము లేకపోయినను నా క్షేపము లేదు' అను శ్రుతి, పండిత వాక్కులు ధ్రువీకరించుచున్నవి. జ్ఞాన సముపార్జనమునకు భారతీయ సాహిత్య భాండారమున ననర రత్నముల వంటి గ్రంథము లెన్ని యో గలవు. ఈ గ్రంథములన్నియు నుపనిషత్తులు, సూత్రభాష్యాదులు ప్రతిపాదించిన విషయములనే ప్రబోధించుచున్నవి. అందు బ్రహ్మ విద్యను నిరవశేషముగ బోధింప సమర్థంబైన ఉదంథము “యోగవాశిష్టము. " ఇది ముప్పది రెండు వేల శ్లోక సంఖ్య కలిగి “బృహద్యోగ వాశిష్టము” అను పేర ప్రసిద్ది జెందినది. ఈ గ్రంథము సర్వజన పఠన పాఠన యోగ్యము కాకుండుటచే కాశ్మీరు దేశీయులగు అభినందన పండితులు హృద్య మధుర కథా సంభరితముగ జాన సారమగు "జాన వాశిష్టము" అను పేర సంగ్రహ పరచిరి. ఇది ఆరు వేల శ్లోక సంఖ్య కల పవిత్ర గ్రంథము.
యోగవాశిష్టము వాల్మీకి మహర్షి విరచితము. షోడశవర ముల ప్రాయము నిండని శ్రీరామచంద్రుడు మోహాంధకారమున మునిగి దిక్కుగానక సుక్కుచుండెను. ఆ సమయమున విశ్వామిత మహరి తన యజ్ఞ సంరక్షణార్థమై రామ లక్ష్మణులను గొనిపోవ దలచి దశరథ మహారాజు కడ కేతెంచెను. ఆయన రామచంద్రుని మోహావస్థ నెరిగి, వశిష్ఠ మహర్షిని జ్ఞానోపదేశ మొనరించి, యతనిని..........