Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

కాలాతీత కథల కథనశిల్పం

శీలా సుభద్రాదేవి, సంపాదకురాలు

డా|| పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో 'కాలాతీత వ్యక్తులు' నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో 'కాలాతీత వ్యక్తులు'కు దీటుగా ఉన్న కథలూ వాటిలో ఉన్నాయి. 1955 నుండి 1960 వరకూ రాసిన కథలు సుమారుగా ఇరవై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే నవల, కథలు, కవిత్వం, వ్యాసాలతో సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకు పైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది.

శ్రీదేవి 1929 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించింది. తండ్రి డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత,

జాతీయవాది కావటాన శ్రీదేవికి బాల్యంనుండీ సాహిత్యాభిలాష, అభినివేశం అలవడ్డాయి. తండ్రితోపాటూ అనేక సమావేశాల్లో పాల్గొనటంవలన జాతీయ సమస్యల పట్లా, సాహిత్యంపట్లా స్పష్టమైన అవగాహన ఆమెకి కలిగింది.