ఇదొక వాస్తవగాథ , జరిగిన గాథ. ఎంతో కొంత ఇంకా జరుగుతూనే వున్నగాథ. అరవై యేళ్ళక్రితం ప్రారంభమై అనేక మలుపులు తిరిగి , వంకర టింకరగా సాగిసాగీ చతికలబడిన ఓ అబల గాథ.
సజావుగా సాగిపోయే జీవితం ఒక చక్కటి గీతలాంటిది. మనిషి వేసే తప్పటడుగులు దాన్ని వంకరగీతగా మార్చేస్తుంటాయి. దిద్దుకోలేని అలాంటి వంకరగితలే రుజు మార్గపు బతుకుబాటను ఎలా మండ్లమయం చేస్తాయో తెలియజేసే ఒక విశిష్ట నవల ఈ వక్రగీత.