కళానిధి సత్యనారాయణ మూర్తి గారు 1936 లో తు.గో.జిల్లా కాకినాడలో జన్మించారు. తండ్రి సంజీవరావు, తల్లి శారదబాయి. హైస్కూలు విద్య రాజోలు బోర్డు హైస్కూలు లో పూర్తి చేసి, బి.ఏ., ఎల్.ఎల్.బి., పట్టాలను హైద్రాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖలో సహాయ కార్యదర్శిగా, ఉప కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పని చేసి, చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా 1991 లో పదోన్నతి పొంది 1995 జూన్ నెలలో పదవి వివరణ చేశారు.
వృత్తి న్యాయశాస్త్రానికి సంబంధించినదే అయినా ప్రవృత్తి భారతీయ తత్వశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యాయం చెయ్యడం. ముఖ్యంగా ఉపనిషత్తులు సామాన్య పాఠకులకు అవలీలగా అర్ధం కావడానికి ఈ గ్రంధాన్ని అయన రచించారు. దీన్ని ఆంగ్ల భాషలోకి కూడా వారు అనువదించారు. ఆ అనువాదాన్ని కూడా శ్రీ వేదభారతి ప్రచురించింది.
-కళానిధి సత్యనారాయణ మూర్తి.