Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ముందుమాట
ధనస్వామ్యానికి జాక్ లండన్ పెట్టిన చేవగల పేరు "ఉక్కుపాదం”. ఇది 1908లో వెలుగు చూసింది. *భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి అగుపించని దాన్ని అవలోకించగల నిర్దిష్ట ప్రతిభ, భవిష్యత్తుని ముందుగా వూహించి చెప్పగలిగిన ప్రత్యేక విషయ పరిజ్ఞానం ఆయనకున్నాయి. ఈనాడు మన కళ్ళముందు దొర్లిపోతున్న సంఘటనల దొంతరని ఆయన ఆనాడే పసిగట్టగలిగాడు. ఈ 'ఉక్కుపాదం'లో మనకి ప్రదర్శితమైన భయానక నాటకం వాస్తవంలో యింకా మొదలు కాలేదు. మార్పు శిష్యుడైన ఈ అమెరికావాసి జోస్యం ఎప్పుడు ఫలిస్తుందో మనకు తెలీదు.
జాక్ లండన్ విప్లవ సామ్యవాది. ఈ పుస్తకంలో కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవరహార్డ్ ముమ్మూర్తులా రచయితని పోలినవాడే. సత్యవివేచనాపరుడు, భవిష్యదర్శనం చేసుకోగల్గిన వివేకవంతుడు, బలాఢ్యుడు, సహృదయుడు అయిన ఎర్నెస్ట్ ఎవరహార్డ్ రచయిత మాదిరిగా కూలీనాలీ జనంలోని వాడు, కాయకష్టం చేసిన కార్మికుడు. జీవితం, మేధస్సు కలబోసి ప్రపంచాన్ని వూపివేసిన యాభైసంపుటాలు రాసి, చిన్న వయసులోనే మృత్యువు కెరయైన జాక్ లండన్ ఒక సామాన్య రైతుబిడ్డడనీ, పొట్టకూటి కోసం 'పదోయేటనే పత్రికలమ్మటం ప్రారంభించాడనీ మీరు తెలుసుకోవాలి.
ఎర్నెస్ ఎవర్ హార్డ్ కి గుండెనిండా ధైర్యం, మెదడునిండా తెలివి, కండబలం, కరిగిపోయే మనసు వున్నాయి. ఈ పాత్రని సృష్టించిన రచయితవీ అవే లక్షణాలు. "న్యూయార్క్ మాక్మిలన్ అండ్ కంపెనీ లిమిటెడ్, లండన్, కాపీరైట్ 1907 (2014 ముద్రణ)..............