"సుందరి!"
గడ్డివేస్తున్న ఆవులను చూస్తూ ఎదో ఆలోచనలలో ఉండిన సుందరి తల తిప్పి చూసింది.
దొంగరాముడు నవ్వుతు తనకేసి వస్తూ కనిపించాడు.
"నాతో నీకేం పని?" అన్నట్లుగా విసుగ్గా చూసింది సుందరి. కస్టపడి పనిచేసే తత్వం లేదు రాముడిలో పశువుల సంతలో, ఇతర పల్లెల్లో వాళ్ళు పశువులు వీళ్ళకు, వీళ్ళ పశువులు వాళ్లకు అమ్మిపెట్టే దళారీ పనులతో కాలం గడిపేవాడి మీద సుందరికే కాదు... ఆ వూర్లో ఎవరికీ సదభిప్రాయం లేదు.
"నీకు సులభంగా రెండు వేల రూపాయలు వచ్చే మార్గం చెప్తా!" అన్నాడు దొంగరాముడు ఆమె దగ్గరగా వచ్చేసి..... ఆమెనే పరిశీలనగా చూస్తూ.
అరకొర ఆహారాలతో, అర్ధాకలితో కాలం గడిపే కుటుంబంలోని పిల్లయినా వయసు తెచ్చిపెడుతున్న మార్పులతో చాలా అందంగా చురుకుగా ఉంటుంది ఆమె.
"దొంగోడు నీమాటలు నమ్మేదెలా ?" అంది అనుమానంగా సుందరి.
తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోగలరు.