Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మానవీయ అసంబద్దతను గ్రహించే జయంత్ కాయ్కిణిగారి దృష్టి విశిష్టమైనది. చిన్న ఊరి నుంచి వచ్చినవారయినా జయంత్ నగరజీవితాన్ని చూసే తీరు కన్నడ భాషకే కొత్తది. ఆయన కథలలో అపేక్ష, నడకలోని లయ, చిమ్మే చైతన్యం అన్నీ ఆయన స్వంతమే. చదవాలి అనిపించే అపురూపమైన ఆకర్షక రచయిత జయంత్.
-గిరీష్ కర్నాడ్
“తూఫాన్ మెయిల్” కథా సంకలనంలోని ప్రతి కథా ఒక మాణిక్యం. మట్టిలో దొరికిన మాణిక్యాలీ కథలు. మసిబారిన, పొగచూరిన బతుకులలోని చీకటి తెరలను మెల్లిగా పక్కకు తప్పించి వెలుతురు కిరణాలను ప్రసరించి, ఆ జీవితాల మానవీయ కాంతులతో మన కళ్ళను, మనసులనూ వెలిగించే కథలివి. ఇన్నాళ్ళకు జయంత్ కాయ్కిణి కథల సంపుటి తెలుగులో వస్తున్నందుకు సంతోషిస్తున్నాను.
....దేన్నయినా స్పృశించి స్పందింపజేయగల జయంత్ గారి రచనల కేంద్ర శక్తి ఎవరికీ కనిపించని వివరాలను ఆయన గ్రహించటంలో ఉన్నది. - ఎంత సామాన్య విషయాన్నయినా, వారిలా సున్నితమైన వినోదంతో, విశిష్టమైన వివరాలతో, మాంత్రిక స్పర్శనిచ్చి చెప్పగల రచయితలు కన్నడ భాషలో లేరు.
-వివేక్ శానుభాగ