ఈ పుస్తకంలో వర్ణించిన సాహసాలతో చాలామటుకు నిజంగా జరిగినవే. వాటిలో ఒకటి రెండు నా సొంత అనుభవాలు. మిగిలినవి నా సహాధ్యాయాలు అనుభవాలు. హక్ఫీన్ లాంటి బాలుడు నిజంగా ఉండేవాడు. టామ్ సాయర్ కూడా అంతే. కానీ, టామ్ ఒకడు కూడా నాకు తెలిసిన ముగ్గురు బాలురు గుణగణాలను చేర్చితే టామ్ పాత్ర తయారైంది.
నా పుస్తకం ప్రధానంగా బాలురకు, బాలికలకు వినోదం కోసం రాసినదైనా, ఆ కారణాన పెద్దవాళ్ళు దీన్ని చదవడం మనరాని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు తమ చిన్నతనంలో తాము ఎలా వుండేవారో, తమ ఆలోచనలు ఎలా వుండేవో , తాము ఎలా మాట్లాడేవారో, ఏ చిత్రమైన సన్నివేశాలలో తమ చిక్కుకునేవారో వారికీ ఆహ్లాదకరంగా జ్ఞాపకం చేయడం కూడా ఈ నవలా రచన ఉద్దేశాలలో ఒకటి.
-నండూరి రామ్మోహనరావు.