Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ద్విభాషా పుస్తకాల క్రమంలో వస్తున్న పుస్తకం ఇది. పాటకులకు స్వామి వివేకానంద భోదనలను సంక్షిప్తంగా పరిచయం చేయడానికి ఈ పుస్తకం ఉద్దేశింపబడినది. స్వామిజీ ధీర వాక్కులను మూల భాషలోనూ (ఆంగ్లంలో), మరియు తెలుగు అనువాదంతో సహా ఇవ్వడం వల్ల వాక్యం చక్కగా అర్ధమవుతుంది. ఈ పుస్తకంలో ఒకే విషయానికి సంబంధించిన స్పూర్తి వాక్కులన్నింటిని ఒక శీర్షిక క్రింద కూర్చడం జరిగినది. వరుసలోని ప్రతి సూక్తి క్రితం పేజిలోని సూక్తిని బలోపేతం చేస్తుండటం వలన పాటకుడు ప్రతి సూక్తినీ చక్కగా అర్ధం చేసుకోవడానికి వీలుంది. కొన్ని భావాలు, సూక్తులు అక్కడక్కడ పునరావృతమై ఉండవచ్చు. స్వామి వివేకానంద సూక్తుల నుంచి అధిక ప్రేరణ పొందటానికి పాటితులకు ఈ పుస్తకం ఉపయుక్తం అవుతుందని భావిస్తాము.