Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

     ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ప్రజల నుండి, ఆలోచనాపరులనుండి బుద్దిజీవులనుండి ప్రకటింపబడే అసమ్మతిని నిస్మబ్దంలోకి నెట్టివేసేందుకే ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువభాగం వ్యాసాలు ప్రభుత్వ వైఖరులు, పాలనా విధానాలు, విధాన నిర్ణయాలు, వాటి అమలు మొదలైన వాటి గురించి తీవ్ర అభ్యంతరం, ఆక్షేపణలు వ్యాసకర్తలందరి నుంచి వ్యక్తం కావటం గమనార్హం.

                        మనది లౌకిక , ప్రజాతంత్ర రిపబ్లిక్ రాజ్యంగా అభివర్ణిస్తుంది రాజ్యాంగం. అయితే దీనిని హిందూ రాజ్యంగా మార్చాలనే ప్రయత్న పరంపరలు కొనసాగుతూ ఉన్నాయి. సమాజం ఎదుర్కొంటున్న హింసాపూరిత ఘటనలలో ఈ లక్ష్యం ప్రతిభింబిస్తూనే ఉన్నది. ఇటువంటి దశలో "సోషలిస్టు సమాజ స్థాపన దిశగా ప్రజా పోరాటాలు ముందుకు పోకుండా లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక రాజ్యం కొనసాగలేదని స్వాతంత్ర్యానంతర దశాబ్దాల అనుభవాలు ఋజువు చేస్తున్నాయి". కాబట్టి ప్రజా పోరాటాలను సమర్ధించడం అనేది ఈ వ్యాసాలలో అంతర్లినాంశం. జన చైతన్యానికి, అవగాహనకు సరైన దిశలో ఆలోచన సాగటానికి ఆచరణగా అనువర్తితం కావటానికి ఇవి కల్పించే భావాలు, భావనలు తోడ్పడతాయి.