విచిత్రోక్తుల వెన్నెల రాయడు
కళాచర్చల కర్పూర వసంత రాయడు
గిరాం చిరంటి వరాల పాపడు
రాశీభూత స్వీయంకృషి
రసబుషి సంజీవ దేవ్!
అయన జీవితమే ఒక సౌందర్యోపనిషత్.
సంస్కృతి అయన మతం.
విశ్వమానవ సౌందర్యం ఆయన ఆదర్శం.
సౌజన్యం ఆయన అనన్య పద్ధతి.
ప్రపంచమే ఆయనకు పాఠశాల: తుమ్మపూడి కుగ్రామమే ఉద్యద్విద్యోద్ఘనం! అందుకే ఈ గ్రంధానికి ఆ శీర్షిక.
అతివాద మితవాదాలను ధిక్కరించిన హితవాదిగా, జీవనకాలభోధనా ప్రసంగాల దేవగాంధారి రాగాలాపనలతో, అసంఖ్యాక సభలలో జిజ్ఞాసువులను జ్ఞానానంద జలధిలో ఓలలాడించిన తేనే కిన్నెర, ఆగరు తెమ్మెర ఆయనే.
-ఎస్.ఆర్.తపస్వి.