భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అధిపత్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాట యోధుడు టిపు సుల్తాన్. 1782 లో తండ్రి హైదర్ అలీ మరణంతో మైసూర్ రాజుగా పదవి బాధ్యతలు స్వీకరించి 17 ఏళ్ల పాటు ప్రజారంజకంగాను, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని భారత భూభాగం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగాను పరిపాలన సాగించాడు. బ్రిటిష్ వారికీ సింహస్వప్నమయ్యాడు. టిపు సుల్తాన్ యుద్ధ వీరుడే కాదు, ,మంచి పాలనా దక్షుడు, పలు భాషల్లో ప్రావిణ్యం కలిగిన మేధావి, కవి.