Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆప్తవాక్యం
ఇంగ్లీషు భాషలో భారతీయ రచయితలు రాసిన పుస్తకాలలో అత్యుత్తమ మైనది 'ది గైడ్.' ఆర్ కె నారాయణ్ కు 1960 లోనే సాహిత్య అకాడెమీ పురస్కారం అందించిన ఉత్తమ గ్రంథం అది. సమాజంలోని ధోరణులూ, మనుషుల మనస్తత్వాలూ, భారతీయులకు ప్రత్యేకంగా ఉండే అలవాట్లు, మానసిక జాడ్యాలూ, జీవితం పట్ల సాధారణంగా ఉండే అభిప్రాయాలూ, నైతికత, ధర్మనిష్ఠ వంటి అంశాలనేకం నారాయణ్ రచనలలో ప్రతిబింబిస్తాయి. ఈ విషయంలో ప్రఖ్యాత అమెరికా రచయిత విలియం ఫాక్స్నర్ (William Faulkner) తో నారాయణ్ సరితూగుతారు. ఒక సామాన్య యువకుడు పరిస్థితుల ప్రాబల్యం వల్లా, సహజ సిద్ధమైన లక్షణాల వల్లా, స్వతహాగా ఉండే గుణగణాల వల్లా ఏ విధంగా పరిణామం చెందుతాడో 'ది గైడ్' నవలలో నారాయణ్ చాలా సరళమైన భాషలో చెబుతారు. వర్తమానం, గతం రెండు ధారలుగా నవల కొంతకాలం నడిచినప్పటికీ పాఠకుడు 'అయోమయానికి గురి కాకుండా సులభగ్రాహ్యంగా రాయడం ఆయన ప్రత్యేకత.
భారతీయతత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న రచయిత కనుకనే ఏ కాలానికైనా 'సరిపోయే సర్వకాలీన నవలారాజాన్ని అలవోకగా రాసినట్టు కనిపిస్తుంది. కథ 'చెప్పడంలో నారాయణ్ తీరు అనితర సాధ్యమైనది.
చాలా సంవత్సరాల కిందట (1965లో) చదివిన ది గైడ్ ను వేమవరపు 'భీమేశ్వరరావు గారు ఇప్పుడు తెలుగులో చదివించారు. దేవానంద్, వహీదా రెహ్మాన్ 'నటించిన గైడ్ సినిమా చూసిన తర్వాత పుస్తకం చదివాను. అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఆనందించాను. అందుకు కారణం నాకూ జీవితానుభవం విస్తరించి, మనుషుల నైజం గురించి అవగాహన పెరగడం, నారాయణ్ రాసింది నిజమే 'కదా అని నవల ఆద్యంతం అనిపించింది. అది నారాయణ్ గొప్పదనం, అనువాదకుడి సామర్థ్యం
"ది గైడ్' లో కథానాయకుడు రాజు. అతను మంచివాడు కాదు. చెడ్డవాడని కూడా చెప్పలేము. నిజానికి ఈ పుస్తకంలో హీరోలూ, విలన్లూ లేరు. పుస్తకం...................