Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                     "Let noble thoughts come to us from all sides" అనే ఈ స్ఫూర్తి వాక్యాన్ని Bhavans Journal అనే ప్రముఖ ఆంగ్ల జాతీయ మాసపత్రిక తన మకూటస్థానంలో శిరోధార్యంగా ధరించుకున్న ఘనమైన ఉదాత్తసూక్తి! మహాత్మగాంధీ స్థాపిత సబర్మతి ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే, ఎదురుగా పెద్ద అక్షరాల ఫలకం మీద దర్శనమిచ్చే నినాద వాక్యమూ ఇదే!

                      "శీలేన శోభతే విద్యా:", "మాతృవత్ పరదారాణి " అన్నారు పెద్దలు. శీలము - అంటే సత్ప్రవర్తన వల్ల విద్య శోభిస్తుంది, పరస్త్రీలను తల్లి వలె చూడాలి. "పరనారీ సోదరుడై ... " న వాడే "పరముడు" - అని సుమతి శతక కవి బద్దెన నీతిబోధన చేశాడు. "కన్నుదోయికి అన్యాకాంతలడ్డంబైన , మాతృభావన చేసి మరలు " మని పోతన్న హితవు పలికాడు.