Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆయన నిరంతర సాహితీ సంగ్రామ జీవితం ప్రొద్దుగుంకేవేళ ఒక్కగా నొక్కగారాల పట్టిని పుట్టు కొచ్చాను. నాకు నవవసంతాలు నిండకనే నన్ను మురిపించి, పద్యపు ముద్దులిచ్చి, తన చిటికెనవేలు పట్టించి, షికారు చేయించిన ఆ చేయి, ఆ రూపం నన్ను విడిచిపోయింది. అంతిమాన్ని చూస్తూ ఉండిపోయాను. వేదనతో వెలిగానే ఇక అడుగులు పడ్డాయి. ఆపై ఎన్నో చూచింది నా కన్ను. ద్వంద్వాల నెన్నో చవిచూచింది గుండియ. ఇక నీ కెన్నటికీ నేనున్నాగా అని మరో దివ్యస్వరం మార్దవంగా వినిపించింది. నిబ్బరంగా అయిపోయాను. ఎగుడు దిగుడు ప్రాంతరాలెన్నో చూచిన నా చూపుకు శ్రీ ఆరోబిందో సమున్నత శిఖరం కనిపించింది. ఆ దర్శనలోతుల్లో, ఎత్తుల్లో రమణీయమైన ఆరోహ ణంలో లయించినట్లైయ్యింది. గతం దిగువకు చూస్తే..... కనిపించని కరమేదో నా చిటికెన వేలు పట్టివస్తుంది. నన్ను వెంబడిస్తుంది. తనను వెలిబుచ్చు కొంటుంది, తాను దాచి ఉంచిన భావాలకు, ఆలోచన లకు, ఉద్వేగాలకు వెలుగునివ్వమంటుంది. 'ఆయన' రచన ఒక నిప్పు. పై బూదిని ఊదేసే తరుణమిది. కాలపు అవసరమో, ఆయన ఆత్మ ప్రేరేపణమోగాని ఆ చేష్ట మొదలయ్యింది. దీనికి సంకేతంగా శ్రీనాగళ్ళ దుర్గాప్రసాద్ గారు ఎప్పటినుండో దాచుకున్న 'ఆయన' పై అభిమానంతో తెనాలిలో తమ సాహిత్య సేవాసంస్థ 'ప్రజ్వలిత' ద్వారా 'ఆయన'పై సభ ఏర్పాటు చేస్తు న్నారు. వారికి నా తొలి కృతజ్ఞతలు.