Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
"శ్రీ సుబ్బాచారిగారు భావుకుడైన పద్యకవి. చక్కని శైలీవిన్యాసంతో పద్యరచన చేసినారు. ఈయనకు మన సంస్కృతి, ఆచారాలయందాసక్తి, విశ్వాసం, నిబద్దత అధికం. దేశభక్తి ఆయన కవిత్వానికి జీవగడ్డి.జాతిజీవనం ఆయన కవితావస్తువు. ఏ విషయాన్నైనా సూక్ష్మదృష్టితో దర్శించి, ఆనుశీలించి, కవితామయం చేయగలిగిన ప్రతిభాసంపన్నుడాయన.......ఇది భావప్రాధాన్యమైన పద్యఖండకావ్యసంపుటిగా పద్యకావ్యంగా విజ్ఞులు భావింతురుగాక”
-శ్రీమొవ్వ వృషాద్రిపతి
"మన ఆచార్య పులికొండ సుబ్బాచార్యగారి చూపు కవితాలోచనాలతో "కవితా కాంతా వృణీతే స్వయం” అన్నటు ఆలోచనాలోచన వీక్షమాణ ఛందఃపరివృతుడై మనకందించిన “తెలుగుల వైభవం” అల్ఫాక్షరముల అనల్పార్థరచన...విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడు (ప్రొఫెసర్ కావ్యశాస్త్రలోకాది అవలోకనం కలవాడైనందున యదార్థవాదిగా (లోకవిరోధిగా) విషయ వివరణ చేయటం ఆనందంగా వున్నది....”
- శ్రీరంగాచార్య