పది పుస్తకాల్ని ముందేసుకొని మొక్కుబడిగా ప్రచురణకర్తల కోసం ఎదో బిట్స్ రూపంలో మీ ముందు పడేసిన పుస్తకం కాదిది. వివిధ పోటీ పరీక్షల్లో A.P.P.S.C., U.P.S .C., T.E.T, N.E.T, S.L.E.T., Junior lecturers , Degree Lecturers వంటి పోటీపరీక్షలకు ప్రిపేర్ కావటం కోసం మేము రాసుకొని నెగ్గిన మెటీరియల్ ఇది. అంతేకాకుండా 1990 నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే జూనియర్ లెక్చరర్స్ , డిగ్రీ లెక్చరర్స్ , గెజిటెడ్, నాన్ - గెజిటెడ్ పరీక్షల ప్రశ్నపత్రాలు , యు.జి.సి. వారు నిర్వహించే నెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, A.P.P.S.C వారు నిర్వహించే S.L.E.T ప్రశ్న పత్రాలు, వీటన్నిటిని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరీక్ష దృష్ట్యా విద్యార్థి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన మెటీరియల్ ఇది. గతంలో ఏ యే అధ్యాయాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి? ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది? అనే ఆలోచనలో నుండే ఈ "తెలుగు ప్రశ్నోత్తర కౌముది" పురుడుపోసుకుంది.