డా|| ఎస్వీ రామారావు 1941 జూన్ లో వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., పి. హెచ్.డి డిగ్రీలు పొందిన రామారావు ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా 2001 లో పదవి విరమణ చేశారు.
1956 నుంచి రచనావ్యాసంగం చేపట్టి 35 గ్రంధాలూ, శతాధిక వ్యాసాలు ప్రచురించారు. వారి సిద్ధాంత గ్రంధం తెలుగులో సాహిత్య విమర్శ ఆరుముద్రణలు పొందింది. ఆచార్య ఎస్వీ రామారావు - తెలంగాణ - వివిధ రంగాలలో ఎలా అభివృద్ధిపధంలో పయనించిందో తెలియ చెప్పే సాహిత్య - సాంస్కృతిక చరిత్రలు రాసిన చెయ్యి తిరిగిన రచయిత.
వారు ఎంతో శ్రమించి అనేక సూక్ష్మాతి సూక్ష్మ అంశాలను సైతం తేనెటీగలా సేకరించి తేనెలాంటి గ్రంథాలను మనకందించారు. తెలంగాణ విమర్శ - చరిత్రగా తెలుసుకోవాలన్న ప్రతివిద్యార్థి తప్పక చదవాల్సిన గ్రంథం ఇది. కొండంత తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్రను కొండంత రూపంలో అందించిన సందర్భం ఇది.