Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
తపోవనము 'తపస్సు' అనగానే ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? జరిగే పనేనా ? తపస్సు ఆంటే ఏమిటి ? ప్రశ్న పరంపర వ్యతిరేక భావంతో మొదలవుతుంది. తపస్సు అంటే - శ్రద్ధ, ఆసక్తి, దీక్ష. మనం నిత్యం చేస్తున్నదే తపస్సు. విద్యార్థి చదువును, ఉద్యోగి ఉద్యోగమును, వ్యాపారులు, ఇతర వృత్తులవారు తమ పనులను, శ్రద్ధగా, ఆసక్తిగా, దీక్షగా పూర్తి చేసుకుంటున్నారు. ఇదంతా తపస్సే. అదే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష, భగవంతుని యందు నిలిపి ఉంచటం అనగానే వెనకడుగు వేస్తున్నారు. మన పూజలు, ధ్యానము భగవంతుని చేరాలంటే మన వాక్కు శుద్దిగా ఉండాలి. అందుకు నిత్యము సత్యమును పలుకుట అభ్యాసం చేయాలి. మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే. అందుకు నిష్కామంగా అనగా ఎటువంటి కోరికలు లేకుండా ధ్యానించాలి. అనవసరంగా ప్రతిచిన్నదానికి అబద్దాలాడటం, ప్రతి చిన్న కోరికా భగవంతునికి నివేదించటం పరిపాటి అయింది. నిష్కామ తపస్సు వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది. స్వశక్తి మీద నమ్మకం కుదురుతుంది. ఆత్మ స్టైర్యం పెరుగుతుంది. లోక శ్రేయస్సు కోసం మన మహర్షులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మనము వారి బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం. స్వచ్ఛ సమాజం కోసం శ్రమిద్దాం! ఈ సందేశాన్ని కథా రూపంలో సమాజానికి అందించే ప్రయత్నమే ఈ "తపోవనం” నవల.