Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అంగీకారం
అళగియసింగర్ (చంద్రమౌళి)
వాళ్ళు వచ్చేసారు. ఇంట్లో ఒకటే హడావిడి. హాలు చాలా చిన్నది. తలుపు సందు నుంచి వచ్చినవాళ్ళని చూసింది సరోజ. నాన్నగారు తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో ఆమెని పిలిచారు. అమ్మ వాళ్ళ కోసం హడావిడిగా టిఫిన్ ఏర్పాట్లు చేస్తోంది. సరోజ మెల్లిగా నడిచి వచ్చి వాళ్ళ ముందు నిలబడింది.
"నమస్కారం చెయ్యమ్మా" అన్నారు నాన్న. ఆమెకి చెయ్యాలనిపించ లేదు. ఎందుకు నమస్కారం చెయ్యాలి? మనసు వ్యతిరేకిస్తున్నా నాన్న మనసుని నొప్పించడం ఇష్టం లేక చేతులను జోడించింది. పరిచయాలు అయ్యాయి. ఒక మూలగా సరోజ కూర్చుంది. మింగేస్తున్నట్టుగా వాళ్ళు ఆమెను చూడసాగారు.
చూడగానే మూర్తికి నచ్చేసింది. దంతాలన్నీ కనబడేలా నవ్వుతూ అతను సంతోష సాగరంలో మునిగి తేలుతున్నాడు. అతనితో వచ్చిన చెల్లెలు నళిని నాన్నగారితో మాట్లాడుతోంది.
"వదిన చనిపోయి ఒక ఏడాది కూడా కాలేదు. అన్నయ్యకి వదిన అంటే ప్రాణం. ఆమె ఉన్నట్టుండి ఇలా పోతుందని అనుకోలేదు. అన్నయ్య తట్టుకోలేక పోయాడు. ఇప్పుడు ఒంటరితనం అతణ్ని వేధిస్తోంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అతను అనుకోవడానికి అదే కారణం. అతణ్ని చూసుకోవడానికి, వండి పెట్టడానికి ఒక తోడు కావాలి."
వాళ్ళ సంభాషణని జాగ్రత్తగా వింటూ అమ్మ లోపలికి వెళ్లి టిఫిన్లు తీసుకుని వచ్చింది..............