Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹175

మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!

మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల 'గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |

మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి............